- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పుడు ఈ పాటలే ట్రెండింగ్‌లో ఉంటున్నాయి
దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో యదార్థ ప్రేమకథ ఆధారంగా రూపొందనున్న ప్రయివేట్ పాటల ఆల్బమ్ ''సునో సునో నా మాట వినో'' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం గిర్నిబావిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రయివేట్ ఆల్బమ్ పాటలను ఈ మధ్య కాలంలో ప్రజలు చాలా ఆదరిస్తున్నారని, ప్రస్తుత మరియు రానున్న కాలంలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ పాట రాసిన మండలానికి చెందిన తోగార్రాయి గ్రామ వాసి రచయిత, దర్శకుడు నెల్లుట్ల సుమన్ మరియు గాయకుడు 'కన్నపేగు బంధమే' ఫేమ్ వెంకటాపురం వాస్తవ్యులు దిలీప్ దేవగన్‌లు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ పాట ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా రానున్నట్లు దర్శక నిర్మాత నెల్లుట్ల సుమన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, డివిజన్ నాయకులు బుస్సాని రమేష్, షెంకేశి కమలాకర్, తుమ్మలపెళ్లి మహేందర్, లైఫ్ ఫెల్యూర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణ్, రాజేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.