- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడు భూమి పట్టాలు సిద్ధం..
X
దిశ, నర్సంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూమి రైతులకు శుభవార్త అందించింది. నియోజక వర్గ వ్యాప్తంగా పోడు భూముల్ని సాగు చేస్తున్న ఎస్టీ రైతులకు పట్టాల పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల చివర్లో పోడు భూముల పట్టాల పంపిణీ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాగా 360 మంది రైతుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు పెద్ది తెలిపారు.
3371 మంది రైతులకు చెందిన 7333 ఎకరాలకు సంబంధించి పట్టాల ముద్రణ ఇప్పటికే పూర్తయినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎస్టీయేతర కులాల సర్వే పూర్తయినట్లు, తెలంగాణ ప్రభుత్వం వీటికి హద్దులు నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బీసీ, ఇతర కులాల పట్టాల పై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు.
Advertisement
Next Story