- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.. కేంద్ర మాజీ మంత్రి
దిశ, మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాపై వస్తున్న దుష్ప్రచారం పార్టీ మార్పు అనేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ జీవితకాలం మొత్తం కాంగ్రెస్ పార్టీకి సేవచేస్తానని మరోసారి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కాంచి అభివృద్ధి శూన్యమని తెలిపారు. అందరినీ కలుపుకొని ముందుకు పోతానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. తాను ఎంపీగా మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సోనియమ్మ తనకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు.
ఏడు నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ అభిమానులను కార్యకర్తలను ఏ సహాయం కావాలన్నా తాను తీరుస్తానని తెలిపారు. కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. రుణమాఫీని ఒకేదాఫాలో తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో రైతులకు అన్యాయం చేసింది అన్నారు. ఈ విలేకరులసమావేశంలో ఘనపూర్ కు అంజయ్య, అరుణ్, ఎండీ అరుణ్, వెంకటేశ్వర్లు, ప్రసాద్, జగ్జీవన్, డిఎస్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.