- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దాడిలో గాయపడిన యువకుడిని పరామర్శించిన మున్నూరు కాపు అధ్యక్షులు
దిశ, ఖిలా వరంగల్ : రెండురోజుల క్రితం హన్మకొండ జిల్లాలో కొంతమంది దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మున్నూరుకాపు ముద్దుబిడ్డ తోట పవన్‌ను హైదరాబాద్ హాస్పిటల్‌లో మున్నూరుకాపు మహాసభ అధ్యక్షులు శ్రీ మణికొండ వెంకటేశ్వర్లు గ, ఉపాధ్యక్షులు కొండూరు వినోద్ కుమార్ , మణికొండ రమేష్ , ఈసీ మెంబెర్ బి. రవికాంత్ , నల్గొండ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు నల్లగొండ ఆంజనేయులు , వరంగల్ జిల్లా మహాసభ నాయకులు శ్రీ పోశాల మనోజ్ కుమార్, హన్మకొండ జిల్లా మహాసభ నాయకులు శ్రీ పేరం గోపికృష్ణ పరామర్శించారు. ఈ సందర్బంగా మహాసభ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పవన్ పై దాడిని ఖండించారు. పేరం గోపి కృష్ణ మాట్లాడుతూ.. పవన్ పై దాడిని దుశ్చర్యగా అభివర్ణిస్తూ , ప్రశ్నించేవారిపై భౌతిక దాడులు ప్రజాస్వామ్యంకి గొడ్డలి పెట్టులాంటిదని , ఇలాంటి చర్యలను సమాజాము సహించదని , దాడిని తీవ్రంగా ఖండించారు. పవన్ పై దాడిని రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపు లంతా పార్టీలకు అతీతంగా ముక్తకంటంతో ఖండించాలని కోరారు. మున్ముందు ఇలాంటి దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తెలిపారు.