- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు: ఎమ్మెల్యే సీతక్క
దిశ, కొత్తగూడ: తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం కొత్తగూడ మండలంలో రాహుల్ గాంధీ చేపట్టిన 2వ రోజు భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ యాత్రకు మద్దతుగా గాంధీనగర్, మైలారం, కిష్టా పూర్ గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి ప్రజల బాధలను సీతక్క అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, మా ములుగు ప్రాంత ప్రజల గుడిసెలు, శిథిలావస్థలో ఉన్న గున పెంక, పాలతిన్ కవర్లు పైన కప్పుకొని ఉన్నా ఇండ్లను వచ్చి చూడాలని ఎద్దేవా చేశారు.
ఫాంహౌస్ లో ఉండి పరిపాలన చేస్తున్న మీకు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాకాల చెరువులో లిఫ్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడ గంగారాం మండలాల రైతులకు సాగు నీరు అందించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చూశారని ప్రస్తుతం పనికిరాని ఆంక్షలతో రైతులపై బీఆర్ఎస్ భారం మోపుతోందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని లక్షల ఇందిరమ్మ ఇళ్లు, వేల కోట్ల రూపాయల పంట రుణాల మాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటివి అమలు చేశామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని, రూ.500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, రైతులకు ఫ్రీ కరెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ తదితర పథకాలను అమలు చేస్తామని అన్నారు. పోడు భూములకు పట్టాలు, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శులు చల్లా నారాయణ రెడ్డి, కొత్తగూడ, గంగారాం జడ్పీటీసీలు పులసం పుష్పలత శ్రీనివాస్, ఈసం రమ సురేష్, ఎంపీపీలు బానోత్ విజయ రూప్ సింగ్, సువర్ణ పాక సారోజన జగ్గారావు, వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు , సుంకర బోయిన మొగిలి, సర్పంచ్ మల్లెల రణధీర్ , ఈసం సమ్మక్క, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.