నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదు : కలెక్టర్‌

by Disha Web Desk 23 |
నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదు : కలెక్టర్‌
X

దిశ, వరంగల్ కలెక్టరేట్ : జిల్లాలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన మాక్ (ట్రయల్) నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను 15 -వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్‌ ప్రావీణ్య పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణలో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. నామినేషన్లపై సిబ్బందికి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ చెప్పారు. ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ ను పరిశీలించి, ప్రతిరోజూ ఎన్నికల సంఘానికి పంపే నివేదికలను నిశితంగా పరిశీలించి పంపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, తహసీల్దార్లు విజయ్ సాగర్, డిటి రంజిత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed