Commissioner : ప్రజావాణి ఫిర్యాదులపై జాప్యం వద్దు

by Kalyani |
Commissioner : ప్రజావాణి  ఫిర్యాదులపై జాప్యం వద్దు
X

దిశ, వరంగల్ టౌన్: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి 70 దరఖాస్తులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో బాదితులు చేసుకున్న దరఖాస్తుల పెండింగ్ లు అధిక సంఖ్యలో ఉన్నాయన్నారు. అట్టి దరఖాస్తులు వచ్చే గ్రీవెన్స్ లోగా 80 శాతం పరిష్కారం కావాలని కమిషనర్ ఆదేశించారు.

ఫిర్యాదుల వివరాలు ఇలా...

ఇంజనీరింగ్ విభాగానికి 17, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగానికి 09, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)కి 08, టౌన్ ప్లానింగ్ విభాగానికి 33, ఎలక్ట్రికల్ కు 01, హార్టికల్చర్ విభాగానికి 02 అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు ప్రవీణ్ చంద్ర, రాజయ్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి, హెచ్ ఓ రమేష్, డీఎఫ్ఓ శంకర్ లింగం, టీపీఆర్ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జి సీపీ రవీంద్ర రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు కృష్ణా రెడ్డి, ప్రసన్న రాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, టీ ఓ. బిర్రు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed