‘డిస్నీల్యాండ్’ లో ఘనంగా జాతీయ సైన్స్ డే..

by Kalyani |
‘డిస్నీల్యాండ్’ లో ఘనంగా జాతీయ సైన్స్ డే..
X

దిశ, హనుమకొండ టౌన్: దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీల్యాండ్ ఇ-టెక్నో పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైన్స్ ఫేర్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు 136 ఎగ్జిబిట్లను ప్రదర్శించి తోటి విద్యార్థులకు వివరించారు. ఈ సైన్స్ ఫేర్ ను పాఠశాల కరస్పాండెంట్ డి.శోభారాణి, డైరెక్టర్స్ డి. రాకేష్ భాను, డి. దినేష్ చందర్ లు సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల సదయ్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రతి వస్తువును పరిశీలించి దాని గురించి తెలుసుకోవాలని సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని డాక్టర్లు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు.

ఈ సైన్స్ ఫేర్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు యశ్యంత్ 9వ తరగతి, మనోజ్ 8వ తరగతి, శ్రీమణీ 9వ తరగతి హైస్కూల్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ప్రైమరి స్థాయిలో వినయ్, వర్మ, పి. అర్జున్ , పి. అఖిల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు పాఠశాల యాజమాన్యం బహుమతులు, సర్టిపికెట్లు అందజేశారు. ఈ సైన్స్ ఫేర్ విజయవంతం కావడానికి కృషి చేసిన సైన్స్ ఉపాధ్యాయులు సీహెచ్. మధు, ఎస్. శివాజి, ఎమ్ రాజారెడ్డి, సీఎచ్. ప్రసాద్, ఎన్. భవ్యలకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed