- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాపాకను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
దిశ, చిట్యాల: నాపాక ఏకశిలా శ్రీ సర్వతోభద్ర దేవాలయం ప్రాంతమును టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తానని, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని నైన్ పాక గ్రామంలోని, నాపాక దేవాలయాన్ని శనివారం రాష్ట్ర టూరిజం సీఈ వెంకటరమణ, జీఎం( ప్రాజెక్ట్స్) ఉపేందర్ రెడ్డి, డీఈ ధనరాజ్, కన్సల్టెంట్ కిషోర్, ఎమ్మార్వో, ఎంపీడీవో,ఫారెస్ట్ ఎండోమెంట్ శాఖల అధికారులు, మండల అధ్యక్షుడు గుట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, ప్రభాకర్ ల కు,పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాపాక ఏకశిలా శ్రీ సర్వతోభద్ర దేవాలయ ప్రాంతాన్ని, అభివృద్ధి కొరకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో, నాపాక దేవాలయాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధిని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.