- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోటీశ్వరులు అవ్వచ్చని ఎరా.. మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా మల్టీ లెవెల్ మార్కెటింగ్
దిశ, గీసుగొండ : తక్కువ మొత్తంలో పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొంది అనతి కాలంలోనే కోటీశ్వరులు కావచ్చు అంటూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏజెంట్లు మధ్యతరగతి కుటుంబాలకు ఆశ చూపి ఆగం చేస్తున్నాయి. కరోనా ఉపద్రవం సమయం నుంచి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల కార్యకలాపాలు పెరిగిపోయాయి. వాట్సాప్ మెసేజ్‌లు జూమ్ మీటింగ్స్ ద్వారా తక్కువ సమయంలో చిన్న పెట్టుబడులతో రూ.కోట్ల సంపాదన పొందవచ్చంటూ బురిడీ కొట్టిస్తున్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.10 వేల నుంచి రూ.15000 చెల్లించి చేరితే బోలెడు లాభాలు పొందొచ్చని, టార్గెట్ రీచ్ అవుతూ వెళ్తే టీవీలు, కార్లు, ఫారెన్ ట్రిప్పులంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు ఆకర్షితులై మోసపోతున్నారు.
ఎలక్ట్రిక్ బైకులు అమ్మకాలంటూ..
భవిష్యత్ కాలంలో పెట్రోల్, డీజీలు వాహనాలు పోయి అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అంటూ పెట్రోల్‌కు రిపేర్లకు అయ్యే ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు అంటూ రోజుకు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించవచ్చు అంటూ ఆకర్షిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.15వేలు కట్టిస్తున్నారు. తాను చేరి కుడివైపు ఇద్దరినీ ఎడమవైపు ఇద్దరిని చేర్పిస్తే చాలని, ఇకనుంచి జతకు రూ.5వేలు పొందవచ్చని ఆశ కల్పిస్తున్నారు. ఇలా పిరమిడ్ గీసి ఆరు నెలలో రూ.కోటి సంపాదించవచ్చని, ఎంతో సులభం అంటూ వివరించి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏజెంట్లు బురిఢీ కొట్టిస్తున్నారు. ఇందులో ఒక్కొక్క స్టేజీలో గిఫ్టుల రూపంలో టీవీలు, కార్లు, ఫారిన్ ట్రిప్పులు అంటూ అదనంగా ఆదాయం పొందవచ్చనడంతో ఆకర్షితులై ఎంతోమంది అమాయకులు ఈ సంస్థలో చేరి మోసపోతున్నారు. ఏడీఎంఎస్, బీబీఎం అనే సంస్థలు ప్రధానంగా ఈ బైకుల పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నాయి.
న్యూట్రిషన్ డ్రింక్స్, ఫుడ్ సప్లమెంటరీ ప్రొడక్ట్స్..
థైరాయిడ్, షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని టార్గెట్ చేస్తూ తమ ప్రొడక్ట్స్ వాడితే మందుల ఖర్చు తగ్గించుకుని ఆరోగ్యం కాపాడుకుంటూనే కోటీశ్వరులు కావొచ్చని కొన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. న్యూట్రిషన్ డ్రింక్స్ అందించే సంస్థలు ఒక ఆఫీసు తీసుకుని రోజు ఉదయం టీవీలో కొన్ని మోటివేషన్ వీడియోలు చూపించి తర్వాత న్యూట్రిషన్ డ్రింకును తాపించి పంపుతారు. వారితోపాటు తమకు తెలిసిన వారిని ఆరోగ్యవంతులను చేయాలంటూ ఈ చైన్ సిస్టంలోకి చేర్పిస్తున్నారు. ఇంకా కొన్ని సంస్థలు ఫుడ్ సప్లమెంటరీ ప్రొడక్ట్స్‌ను ఈ విధంగానే అందిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా వెస్టేజ్, పూసానా, ఆర్ఎంసీ వంటి సంస్థలు ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ అమాయకులను బలి చేస్తున్నాయి.
ఆర్థిక నేరాలపై దృష్టి సారించాలి..
భారతదేశంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ నిషేధం విధించి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సంస్థలు, ప్రతినిధులను కఠినంగా శిక్షించాలి. రూ.కోట్లు సంపాదించవచ్చనే ఆశతో ఎంతో మంది అమాయకులు ఈ మోసాలకు బలి అవుతున్నారు. ఈ ఆర్థిక నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థల బురిడీ బాబుల బాగోతాలకు అడ్డుకట్ట వేయాలి.