- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉభయ రాష్ట్రాల్లో విలువైన సేవలు అందిస్తున్న దిశ దినపత్రిక
దిశ, గండిపేట్ : తెలుగు ఉభయ రాష్ట్రాల్లో సంచలన వార్తలకు నెలవుగా దిశ దినపత్రిక తన సేవలను అందిస్తుందని, దిశ పత్రికలో వెలువడే వార్తలను తాను చదువుతానని మణికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ కొండకళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దిశ దినపత్రిక నిరంతరం ప్రజల సమస్యలపై గళమెత్తి ప్రభుత్వానికి వివరిస్తుందని ఆయన వివరించారు. మంగళవారం దిశ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు తాజా వార్తలను దిశ దినపత్రిక పాఠకులకు అందిస్తుందని అన్నారు. ప్రారంభించిన నాటి నుంచే ఎంతో విలువైన వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుందని కొనియాడారు.
ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి తెలియజేయడంలో దిశ దినపత్రిక చొరవ మరువలేనిదని గుర్తు చేశారు. దిశ పత్రికలో పనిచేసే జర్నలిస్టులు సైతం నిబద్ధతతో పనిచేస్తూ వార్తలను సేకరించి నిర్భయంగా ప్రచురిస్తారని వివరించారు. దిశ పత్రిక క్రమశిక్షణతోనే ఎంతో ఎత్తుకు ఎదగడమే కాకుండా ప్రముఖ ప్రఖ్యాత పత్రికలకు పోటీని ఇస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం పత్రిక యాజమాన్య విధానాలు, పనిచేస్తున్న సిబ్బంది గొప్పతనం అని వివరించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పత్రిక మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుద్ధులు శ్రీరాములు, నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమార్, గంగాధర్, శివగంగా తదితరులు పాల్గొన్నారు.