Pranab: ‘రాష్ట్రీయ స్మృతి స్థల్’లో ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం.. ఆమోదం తెలిపిన కేంద్రం

by vinod kumar |
Pranab: ‘రాష్ట్రీయ స్మృతి స్థల్’లో ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం.. ఆమోదం తెలిపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab mukarjee) స్మారక చిహ్నం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను ఢిల్లీలోని రాజ్ ఘాట్ కాంప్లెక్సులో ఒక భాగమైన ‘రాష్ట్రీయ స్మృతి స్థల్‌’ (Rashtriya Smriti Sthal)లో స్థలాన్ని కేటాయించింది. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ (Sharmishta mukarjee) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రణబ్ స్మారక చిహ్నానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఆర్డర్స్‌ను షేర్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోడీని ఇటీవల కలిశాను. బాబా కోసం స్మారక చిహ్నం నిర్మించాలని ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము దీనిని డిమాండ్ చేయలేదు. అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంస నీయం’ అని తెలిపారు. గౌరవం కోసం డిమాండ్ చేయకూడదని ప్రణబ్ చెప్పేవారని గుర్తు చేశారు. అయితే ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మాణానికి స్థల ఎంపిక కోసం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రణబ్ స్మారకానికి కేంద్రం ఆమోదం తెలపడం గమనార్హం. కాగా, ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా సేవలు అందించారు.

Advertisement

Next Story

Most Viewed