Earthquake : నేపాల్-టిబెట్ భూకంపం... 126 కు పెరిగిన మృతులు

by M.Rajitha |
Earthquake : నేపాల్-టిబెట్ భూకంపం... 126 కు పెరిగిన మృతులు
X

దిశ, వెబ్ డెస్క్ : నేపాల్-టిబెట్(Nepal-Tibet) సరిహద్దుల్లో మంగళవారం ఉదయం తీవ్ర భూకంపం(Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో ఏర్పడిన భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 12 మంది మరణించగా.. 188 మంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో లోబుచేకి (Lobuche) ఉత్తర-వాయువ్యంగా 84 కి.మీ దూరంలో సుమారు 10 కి.మీ లోతున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఉన్న ప్రాంతం టిబెట్ లో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద భారీగా జనం చిక్కుకు పోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూకంపం తీవ్రత నేపాల్, టిబెట్, భారత్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్ లో కనిపించింది.

Advertisement

Next Story