- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ అంటేనే భరోసా... ఎమ్మెల్యే చల్లా..
దిశ, హనుమకొండ టౌన్ : బీఆర్‌ఎస్ అంటేనే ప్రజలకు భరోసానిచ్చే పార్టీ, సబ్బండ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలం మల్కపేట, వెంకటాపురం, హైబోత్ పల్లి, లక్ష్మీపురం, నాగారం గ్రామ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో దామెర మండలంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అంటేనే ప్రజలకు భరోసానిచ్చే పార్టీ, సబ్బండ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలను సూచించారు.
మనది రైతు ప్రభుత్వమని, రైతన్నల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. మన పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయో చెప్పాలని బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ ఉంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పార్టీ కోసం పనిచేయాలన్నారు.
బీఆర్‌ఎస్‌లోకి చేరికలు..
బీఆర్‌ఎస్‌లోకి చేరికలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పరకాల శాసనసభ్యులు చల్లాధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలం హైబోత్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మేల్యే చల్లా సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశప్రజలు తెలంగాణ మాడల్ అభివృద్ధినే కోరుకుంటున్నారని, అందుకే ప్రజలు, యువత స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.
పార్టీలో చేరినవారు..
ఎండీ. మీరా సాహెబ్, రఫిక్, సుకుర్, రజాక్, రాజ సాహెబ్, రాజ్ మహ్మద్, మోహినిద్దిన్, కుమ్మరి రాజేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.