తెలంగాణ ప్రభుత్వం.. రైతు సంక్షేమ ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

by Sumithra |   ( Updated:2023-09-02 09:46:02.0  )
తెలంగాణ ప్రభుత్వం.. రైతు సంక్షేమ ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
X

దిశ, సంగెం : సంగెం మండలం ఏల్గూర్ రంగంపేట, సంగెం గ్రామాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్గూర్ రంగంపేట గ్రామంలో రూ.40 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, గ్రామ పంచాయతీ భవనానికి శంఖుస్థాపన చేశారు. అలాగే 82లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, పల్లెప్రకృతివనం, స్మశాన వాటికలను ప్రారంభించారు. అదేవిధంగా అకాల వర్షాలకు పంట నష్టపోయిన సంగెం, కుంటపల్లి, గాంధీనగర్, కొత్తగూడెం, ఎల్గూర్ రంగంపేట, ఎల్గూర్ స్టేషన్, బిక్కోజినాయక్ తండా గ్రామాలలోని 1200 మంది రైతులకుగాను కోటి 29లక్షల 19వేల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడటమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పై విషప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పసునూరి సారంగపాణి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాగర్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story