Mini Medaram Jathara : మినీ మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

by M.Rajitha |
Mini Medaram Jathara : మినీ మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిబ్రవరి నెలలో మేడారంలో జరగనున్న మినీ మేడారం జాతర(Mini Medaram Jathara) ఏర్పాట్లపై మంత్రి సీతక్క(Minister Seethakka) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని సీతక్క అధికారులను ఆదేశించారు. మహా జాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. గత రెండు వారాలుగా భక్తులు రాక పెరిగిపోయిందని, ఫిబ్రవరి మొదటి వారం నుంచి భక్తుల తాకిడి మరింత అధికం కానున్న సందర్భంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంపన్న వాగు వద్ద మహిళా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమయ్యే పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Advertisement

Next Story