- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి సీతక్క...
దిశ, ములుగు ప్రతినిధి: సోమవారం ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వెంకటాపూర్ జడ్పీహెచ్ఎస్ లో కంప్యూటర్ ల్యాబ్, (సీ ఎస్ ఆర్ నిధులు మౌరిటెక్ ఐటీ సంస్థ సౌజన్యం) 10 కంప్యూటర్లను, గోవిందరావుపేట మండలం చల్వాయి నేషనల్ హైవే నుండి లక్నవరం లేక్ వయా బుస్సాపూర్ వరకు 3 కోట్ల 60 లక్షల నిధులతో రహదారి, ప్రత్యేక మరమత్తు పనులకు శంకుస్థాపన, నేషనల్ హైవే నుండి ఎల్బీనగర్ వయా దుంపల్లి గూడెం వరకు 1 కోట్ల 58 లక్షల నిధులతో రహదారి, ప్రత్యేక మరమత్తు పనులకు శంకుస్థాపన, బాలాజీ నగర్ జడ్పీ క్రాస్ రోడ్డు నుండి సండ్రగూడెం మీదుగా లక్ష్మీపూర్ వరకు 1 కోట్ల 20 లక్షల నిధులతో రహదారి, ప్రత్యేక మరమత్తు పనులకు, తాతయిపల్లి (బాలాజీ నగర్ క్రాస్ రోడ్) నుండి పాపయ్యపల్లి మీదుగా మద్దుల గూడెం వరకు 70 లక్షల నిధులతో రహదారి, ప్రత్యేక మరమత్తులకు శంకుస్థాపన చేశారు.
తాడ్వాయి మండలం లోని కాటాపూర్ వద్ద పీఆర్ రహదారి నుండి దామెరవాయి వరకు 60 లక్షల నిధులతో, జడ్పీ రోడ్డు నుండి భూపతిపూర్ వరకు 44 లక్షల నిధులతో, కాటాపూర్ రోడ్డు నుండి భూపతిపూర్ వరకు 55 లక్షల నిధులతో, కాటాపూర్ రోడ్డు నుండి జగ్గారం మీదుగా పంబా పూర్ వరకు కోటి 41 లక్షల నిధులతో, కాటాపూర్ X రోడ్ నుండి బస్టాండ్ వరకు 64 లక్షల నిధులతో రహదారి, ప్రత్యేక మరమత్తు పనులకు శంకుస్థాపన, మేడారం లో శివరామ్ సాగర్ మీదుగా ఆర్ అండ్ బి రోడ్ నుంచి మేడారం వరకు 2 కోట్ల 75 లక్షల నిధులతో, స్థూపం (కమాన్) నుండి సారలమ్మ ఆలయం వరకు 2 కోట్ల నిధులతో, స్థూపం నుండి ఊరట్టం వరకు 2 కోట్ల నిధులతో, ఆర్ అండ్ బి రోడ్డు నుండి కాల్వపల్లి వరకు 2 కోట్ల 50 లక్షల నిధులతో రహదారి ప్రత్యేక మరమత్తు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా పంట పొలాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాలలో పాఠశాలలు, ఆస్పత్రుల భవనాల నిర్మాణం కోసం అనుమతి ఇవ్వకపోవడంతో నూతనంగా అటవీ ప్రాంతంలో కంటైనర్ పాఠశాలను, ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ములుగు నియోజకవర్గం 75 శాతం అటవీ ప్రాంతం తో కూడి ఉండటం తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నదని, దీనిపై తాను స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి పరిష్కరించడానికి కృషి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, డీ ఈ ఓ పాణిని, మౌరిటెక్ ఐటీ కంపెనీ ప్రతినిధులు నంద మోహన్, మనోజ్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.