భావితరాలకు స్ఫూర్తి దాత అంబేద్కర్.. మంత్రి ఎర్రబెల్లి

by Sumithra |   ( Updated:2023-05-20 15:13:03.0  )
భావితరాలకు స్ఫూర్తి దాత అంబేద్కర్.. మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, రాయపర్తి : ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తి దాత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండలంలోని కేశవపురం గ్రామంలో గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈ విగ్రహావిష్కరణకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అన్నివర్గాల ప్రజలకు సముచితంగా న్యాయం జరగాలని ఉద్దేశంతో ఏ దేశంలో లేనట్టుగా మన భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజలకు అంకితం చేశారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని, అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి జెడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, నాయకులు పూస మధు, ఎండీ అష్రఫ్, రైతుబంధు మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్రావు, అంబేద్కర్ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story