- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామ మెటర్నిటీ హాస్పిటల్ లో మైగ్రేషన్ లొల్లి...
దిశ, జనగామ : జనగామ ఎమ్ సీ హెచ్ దవాఖాన పేరుకే పెద్ద ఆసుపత్రి.. కానీ అక్కడికి వెళ్లిన రోగులు కంటతడి పెట్టుకోవాల్సిందే.. ఈ క్రమంలోనే ఓ పేషెంట్ పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన అంటే అందరికీ ఉచితం అనే పదం ప్రతి నానుడి అందరి నోటా వినపడుతుంది. కానీ జనగామ మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్లు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. వివరాలు పరిశీలిస్తే ఉదయం యాదగిరి గుట్టకు చెందిన మిట్ట శృతి అనే గర్భిణీని జనగామ ప్రాంతంలో నివసించే తల్లి జనగామ చంపక్ హిల్స్ లోని మెటర్నిటీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు.
ఒపీ రాపిస్తున్న తరుణంలో ఆధార్ కార్డు ప్రకారం యాదగిరిగుట్ట అని ఉన్న కారణంగా వేరే జిల్లా నుంచి ఇక్కడికి రావొద్దు మీరు అక్కడే చేయించుకోవాలి అని మహిళను, వారి తల్లిని దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు. వారి తల్లి మాది జనగామే, గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడే చూపింకుంటున్నాం అని వాదిస్తున్నా వినకుండా ఇక్కడ చూడరు అని డ్యూటీ డాక్టర్ చెప్పడంతో వారు వెంటనే మీడియాను ఆశ్రయించారు. తనతో తన బిడ్డతో వైద్యులు ఇష్టం వచ్చినట్టు వ్యవరించారని, ఇంకోసారి ఇక్కడికి తీసుకొస్తే బాగుండదు అని డాక్టర్ ఫైల్ మొకం మీదకు విసిరేసిందని తెలిపారు. ఇదేంటని సూపర్డెంట్ ను కలిసినా ఫలితం లేకుండా పోయింది అన్నారు. అలాగే తమతో పాటు కొంత మంది దూరప్రాంత నుంచి వచ్చారని వారిని సైతం అలాగే అన్నారని ఇటువంటి డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకున్నారు.
దీనిపై సూపర్ డెంట్ మధుసూదన్ రెడ్డిని వివరణ కోరగా డాక్టర్ల కొరత ఉందని, పని ఒత్తిడిలో అలా అన్నారని ప్రతి ఒక్కరికీ చూస్తామని పేర్కొన్నారు.