ప్రజల్లో మార్పు కనిపిస్తోంది.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : శ్రీధర్ బాబు

by Vinod kumar |   ( Updated:2023-11-30 04:48:37.0  )
ప్రజల్లో మార్పు కనిపిస్తోంది.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, మంథని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శాంత గ్రామమైన కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో పోలింగ్ స్టేషన్ 151లో శ్రీధర్ బాబు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు పరుస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.


యావత్ రాష్ట్ర ప్రజానీకం ఈ ప్రభుత్వ పాలనపై విసిగివేసారి పోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజలు అందించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, అనేక అంశాలు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన అంశాలు మేనిఫెస్టోలో ఉన్నట్లు.. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ ప్రక్రియలో ప్రజలందరికీ ఆశీర్వాదం లభిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. శ్రీధర్ బాబు సహోదరుడు ఈ పాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల్ శ్రీను బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గం కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ కారెన్గుల తిరుపతి, ఎంపీటీసీ బోడ మమత నరేష్, సర్పంచ్ జంగిలి నరేష్, నాయకులు మహేష్ గౌడ్, తోగరి రాజేందర్, ప్రశాంతు వెంకటేష్, శ్రావణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed