- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నౌకరీ ఒక్కటి.. చాకిరి మరొక్కటి.. నియామక ఉత్తర్వులు బేఖాతర్
దిశ, వరంగల్ టౌన్ : ఏనుమాముల మార్కెట్ అక్రమాలకు అడ్డాగా మారిందనడానికి మరొక ఉదాహరణగా నిలుస్తోంది ఈ వ్యవహారం. నియామక ఉత్తర్వుల్లో కొలువు ఒక్కటైతే.. నిర్వహించే విధులు మరొక్కటి చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో యూడీసీగా విధులు నిర్వహించాల్సిన ఓ ఉద్యోగి.. సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తించడం విస్తుగొల్పుతోంది. అది కూడా అదనపు బాధ్యతలు అంటూ సదరు ఉద్యోగితో పని చేయించడం ఆసియా ఖండంలో రెండో అతిపెద్దదైన ఏనుమాముల మార్కెట్‌కే చెల్లుబాటవుతోంది. ఆ పనులైన అతడు సవ్యంగా చేస్తున్నాడంటే అదీ లేదు. ఆయనపై అన్నీ అవినీతి ఆరోపణలే ఉన్నాయి. గత సంవత్సరం మిర్చి యార్డు ఇన్‌చార్జ్ సూపర్‌వైజర్‌గా జీరో దందాను ప్రోత్సహించి నట్లు ఆరోపణలు ఎదుర్కోవడంతో అతనిపై వేటు పడింది. అక్కడి నుంచి అపరాల యార్డుకు మారినా... పుర్రెలో పుట్టిన బుద్ధి.. ... పోదన్నట్లుగా అక్కడా జీరో దందాకు తెరలేపి చీవాట్లు పడినట్లు మార్కెట్ వర్గాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతోంది.
ఇలా అతడు అసలు డ్యూటీని పక్కనపెట్టి మార్కెట్ కార్యదర్శులు ఇతర పనులకు వినియోగించడం ఏంటని మార్కెట్ వర్గాల నుంచే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఉద్యోగిని అకౌంటెంట్‌గా నియమితులయ్యారు. కానీ, ఆమె నియామక ఉత్తర్వులను సైతం బేఖాతర్ చేస్తూ మార్కెట్ కార్యదర్శి సదరు ఉద్యోగినితో అసెస్మెంట్ విభాగం పనులు చేయిస్తుండడం గమనార్హం. నియామకపు పనులు కాకుండా ఇతర పనులకు వినియోగించడం వెనుకు ఆంతర్యమేమిటో మార్కెట్ కార్యదర్శితోపాటు జిల్లా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులే సెలవివ్వాలి. అసలు వారు ఆయా ఉద్యోగాలకు అర్హులా? అనర్హులా? అనే అనుమానాలకు అధికారులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్‌లో వాచ్‌మెన్‌ను సైతం మార్కెట్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించినా సందేహించాల్సిందేమీ లేదని మార్కెట్ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆ పోస్టులు ఖాళీ..?
వాస్తవానికి సదరు ఉద్యోగి ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో పని చేయాల్సి ఉంది. అయితే, ఆ విధులపై అతనికి అవగాహన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అతడిని సూపర్‌వైజర్ విధుల్లో నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అకౌంటెంట్ విభాగంలో పనిచేయాల్సిన మరో మహిళా ఉద్యోగిని అసెస్‌మెంట్ విధులకు నియమించడంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లా? భర్తీ అయినట్లా? మార్కెట్ అధికారులే తేటతెల్లం చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఆయా పోస్టులను ప్రస్తుతం ఓ ఉద్యోగికి, ఓ అధికారికి అదనపు బాధ్యతలు అంటగట్టి నట్లు తెలుస్తోంది. మొత్తం అసలు ఉద్యోగులను పక్కనపెట్టి.. అదనపు బాధ్యతలు మరొకరికి అప్పగించడం ఈ మార్కెట్‌కే చెల్లుబాటవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మార్కెట్ ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.