కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. మంచాల తిరుపతి

by Sumithra |
కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. మంచాల తిరుపతి
X

దిశ, భీమదేవరపల్లి : గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి మంచాల తిరుపతి డిమాండ్ చేసారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి మంచాల తిరుపతి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించానే డిమాండ్ పరిష్కరించాలని అన్నారు.

పీఆర్సీలో నిర్ణయించిన మినిమన్ బేసిక్ రూ.19వేల వేతనంగా ఇవ్వాలి. జీవో నంబరు 60 ప్రకారం స్వీపర్లకు 15,600లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని, జీవో నెం.51ని సవరించి మల్టీ పర్సస్ సర్వర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని అన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగ నియామకం చేయాలని అన్నారు. సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసారు. పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా, గ్రాట్యూటీ, గుర్తింపు కార్డులు అందించడంతో పాటు ప్రమాదంలో మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని అన్నారు.

8 గంటల పని దినాన్ని అమలు చేసి వారాంతపు, పండుగలు, జాతీయ ఆర్జిత సెలవు దినాల అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేసి, గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు అందిస్తూ సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్, సరిపడా చెప్పులు, పప్పులు, నూనెలకు నగదు రూపంలో అలవెన్స్ గా చెల్లించాలని అన్నారు. కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిశీలించే వరకు సమ్మె మద్దతుగా సీపీఐ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఆదరి రమేష్, గ్రామ పంచాయతీ వర్కర్స్ సంఘం అధ్యక్షుడు నీలం కుమార్, కార్యదర్శి మంగ సారయ్య, ఉపాధ్యక్షుడు బోనం అజయ్, సహాయ కార్యదర్శి పందుల రాజు, చిదురాల రాజమౌళి, తాళ్లపల్లి మల్లయ్య, వేల్పుల అజయ్, తాళ్లపల్లి ప్రతాప్, గజ్జెల కల్పన, రేణికుంట్ల పిలిప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed