- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రమాదవశాత్తు చెరువు తూంలో ఇరుక్కొని వ్యక్తి మృతి..
by Kalyani |

X
దిశ, వేలేరు(ధర్మసాగర్): ప్రమాదవశాత్తు చెరువు తూంలో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ధర్మసాగర్ మండల పరిధి ముప్పారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పారం గ్రామానికి చెందిన ల్యాగ యాదగిరి(55), వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం ముప్పారం పెద్ద చెరువు తూం విప్పడానికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి వెళ్లాడు.
తూం గేట్ వాల్ విప్పుతున్న క్రమంలో గేట్ వాల్ పైకి రాకపోవడంతో దానిని సరి చేయడానికి చెరువులోకి దిగి దానిని సరిచేస్తున్న క్రమంలో తూంలోకి నీటి ప్రవాహం ఎక్కువ రావడంతో నీటి తాకిడికి తట్టుకోలేక, తూం లోపల ఊపిరాడక యాదగిరి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి భార్య కనకలక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story