- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కిక్కే కిక్కు.. ఎక్సైజ్ శాఖకు కాసులు కురిపించిన డిసెంబర్ 31..
డిసెంబర్ 31 అంటే సుక్క, ముక్క లేకుండా దావత్ అనేది ఉండదు. ఏటా డిసెంబర్ 31న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సారి కూడా మందుబాబులు అదే ఒరవడిని కొనసాగించారు. డిసెంబర్ 31న ఎక్సైజ్ శాఖకు సేల్స్ కిక్కెంచాయి. డిసెంబర్ 31న ఒక్క రోజే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో రూ.36 కోట్ల నుంచి రూ.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాలు పెరగడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 వైన్స్, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాస్తవానికి నిర్ధిష్టమైన లెక్కలు తీస్తే ఈ రికార్డు ఆదాయం పెరిగే అవకాశం ఉందని శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం ఎక్సైజ్ డిపో, కార్యాలయాలకు సెలవు కావడంతో.. డిసెంబర్ 31న సేల్స్‌ను ప్రాథమికంగా అంచనా వేస్తూ వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 31 సందర్భంగా గత పదిరోజులకు ముందు నుంచి వైన్ షాపులకు తరలిన మద్యాన్ని లెక్కలోకి తీసుకుంటారు. ఈ మొత్తం వివరాలను క్రోడికరిస్తే రూ.60 కోట్ల అమ్మకాలకు చేరువలో ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. డిసెంబర్ 31తో సర్కార్ ఖజానాకు మద్యం భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే ఓరుగల్లులో కిక్కు కనిపించింది.
దిశ, వరంగల్ బ్యూరో : డిసెంబర్ 31 అంటే సుక్క, ముక్క లేకుండా దావత్ అనేది ఉండదు. ఏటా డిసెంబర్ 31న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సారి కూడా మందుబాబులు అదే ఒరవడిని కొనసాగించారు. డిసెంబర్ 31న ఎక్సైజ్ శాఖకు సేల్స్ కిక్కెంచాయి. డిసెంబర్ 31న ఒక్క రోజే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో రూ.36 కోట్ల నుంచి రూ.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాలు పెరగడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 వైన్స్, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాస్తవానికి నిర్ధిష్టమైన లెక్కలు తీస్తే ఈ రికార్డు ఆదాయం పెరిగే అవకాశం ఉందని శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం ఎక్సైజ్ డిపో, కార్యాలయాలకు సెలవు కావడంతో.. డిసెంబర్ 31న సేల్స్‌ను ప్రాథమికంగా అంచనా వేస్తూ వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 31 సందర్భంగా గత పదిరోజులకు ముందు నుంచి వైన్ షాపులకు తరలిన మద్యాన్ని లెక్కలోకి తీసుకుంటారు. ఈ మొత్తం వివరాలను క్రోడికరిస్తే రూ.60 కోట్ల అమ్మకాలకు చేరువలో ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. డిసెంబర్ 31 తో సర్కార్ ఖజానాకు మద్యం భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే ఓరుగల్లులో కిక్కు కనిపించింది.
పెరిగిన సేల్స్..!
మంగళవారం ఒక్కరోజులోనే సుమారు రూ.36 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గడిచిన 5 రోజుల్లో మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపుల వరకూ రూ.కోట్ల విలువైన మద్యం చేరుకోగా డిసెంబర్ 21 నుంచి 31 వరకు కేవలం 9 రోజుల్లోనే దాదాపు రూ.60 కోట్ల విలువైన మద్యం మందుబాబులు తాగేసినట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు మద్యం షాపుల యాజమాన్యాలు చెబుతున్నాయి. గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు వారు చెబుతున్నారు. లిక్కర్ కంటే బీర్లే అత్యధికంగా అమ్ముడుపోయినట్లు సమాచారం. వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఉన్నాయి. ఆరు జిల్లాల్లో హనుమకొండ జిల్లాలోనే లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని మొత్తం మద్యం అమ్మకాల్లో అధికశాతం అమ్మకాలు హనుమకొండ జిల్లాలోనే జరగడం గమనార్హం.
ఈ ఏడాది కాసులే కాసులు..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఏడాది దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు రాష్ట్రంలోనే రికార్డు బద్దలు కొట్టాయి. వరంగల్ పట్టణ, రూరల్ పరిధిలో 49.88శాతం, జనగామ జిల్లాలో 89.87శాతం విక్రయాలు అధికంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 294 వైన్స్, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 2023 సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రూ.95.53 కోట్ల అమ్మకాలు జరిగితే 2024 దసరాకు రూ.142.76కోట్ల ఎక్సైజ్ శాఖకు చేరడం గమనార్హం. దాదాపు రూ.48.26 కోట్లు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు నిర్ధిష్టమైన లెక్కలు తీస్తే గతేడాది డిసెంబర్ 31 అమ్మకాలతో పొల్చితే 2024 డిసెంబర్ 31 అమ్మకాల్లోనే గ్రోత్ ఉండడం ఖాయమని అధికారులు వెల్లడిస్తుండడం గమనార్హం.