- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ.ఓ పై ఎమ్మెల్యే ఆగ్రహం..!
దిశ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల వ్యవసాయ అధికారి పరమేష్ పై ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా గతేడాది అకాల వడగండ్ల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు గత కొన్ని రోజులుగా చెక్కుల పంపిణీని చేస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల, కన్నరావుపేట, నారక్కపేట గ్రామాలలో శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రైతులు తక్కువ హాజరవ్వడంతో ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వకపోవడంతోనే రైతులు కార్యక్రమానికి రాలేదని తెలిపడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది అధికారులను మందలించారు. పార్టీలకతీతంగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించి రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి చెక్కుల పంపిణీ పూర్తిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్, తహసిల్దార్ మంజుల, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, భానోతు సారంగ పాణి, సర్పంచులు ఎంపీటీసీలు రైతు కో ఆర్డినేటర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.