వనం విడిచి మన ఇంటికి రా బిడ్డ

by Kalyani |
వనం విడిచి మన ఇంటికి రా  బిడ్డ
X

దిశ, లింగాల ఘణపురం : ఇంటిని, బంధాలను వదిలి అడవి బాట పట్టిన తన బిడ్డ ఇంటికి రావాలని వృద్ధాప్యంలో ఉన్న కన్న తండ్రి కన్నీటి పర్యంతం అయిన సంఘటన మండలంలోని నెల్లుట్ల వడ్డెర కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన పందిగోటి చెన్నయ్య కూతురు పందిగోటి శారద ఇంటిని వదిలి మావోయిస్టు దళ సభ్యులుగా పని చేస్తుంది. సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు, తన కూతురు ఇంటివైపే చూడలేదని, తండ్రి చిన్నయ్య బోరున విలపించాడు. ఉన్న కుమారుడు కూడా చనిపోయాడని, ఇప్పటికైనా తన కూతురు అడవి బాటను విడిచి ఇంటికి రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీంశర్మ, సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రావణ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది కలిసి ఆ కుటుంబానికి సీపీ ఆదేశాల మేరకు సంక్రాంతి కానుకగా నిత్య అవసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. మావోయిస్టు లో చేరిన పందిగోటి శారద జన స్రవంతి లో కలిసి అనాథలుగా ఉన్న కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామని, ఆమెపై ఉన్న రివార్డును కూడా అందజేస్తామని అన్నారు.

Advertisement

Next Story