- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పాలనలో మహిళలకు భద్రత కరువు : సింగపురం ఇందిరా
దిశ, జనగామ : కేసీఆర్ పాలనలో మహిళలకు భద్రత కరువైందని స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపూర్ ఇందిర అన్నారు. రఘునాథపల్లి మండలంలోని సోమయ్య కుంట తండా, నిడిగొండ కోమల్ల, అయ్యవారిగూడెం,గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో 35 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఆరోపించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఊరూరుకి బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులుగా మార్చాలని ముఖ్యమంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో మేకల వరలక్ష్మి, గంగిడి నరసింహారెడ్డి, లింగాల జగదీష్ చంద్ర రెడ్డి, పేర్ని ఉష రవి, మేకల నరేందర్ కోళ్ల రవి, ఎలబోయిన సంపత్, సాంబయ్య తదితరులతో పాటు పలురా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.