- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : కేసీఆర్‌కి తమ్ముడు మా వినయ్ అన్న..
దిశ, హనుమకొండ : కేసీఆర్ కి తమ్ముడు లాంటి వ్యక్తి మా వినయ్ భాస్కర్ అన్న, మా అన్న సూర్యుడి లాంటివాడు.. మంచి మాస్ లీడర్ అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో హన్మకొండ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పేరులోనే వినయం ఉంది, వినయంతో మా భాస్కరుడు అంటే సూర్యుడని అన్నారు. కేసీఆర్ కి తమ్ముడు లాంటి వ్యక్తి అని, మంచి మాస్ లీడర్ మా అన్న వినయ్ భాస్కర్ అన్న అని అన్నారు.
ఇప్పుడు భాస్కరుడు అని ఎందుకన్నానంటే, వినయ్ అన్న సూర్యుడి లాంటివాడు అని , సూర్యుడు కూడా అప్పుడప్పుడు నల్లని మబ్బుల మధ్యలో కొద్ది రోజులు కనిపించకుండా పోతాడు, ఇప్పుడు కూడా హనుమకొండ, వరంగల్ లో జరుగుతుంది అదే అని, కొద్ది రోజులు మాత్రమే అన్న ఇలా ఉంటాడు అని, రానున్న రోజుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు. రానున్న రోజుల్లో వినయ్ అన్న తప్పకుండా మంత్రి అవుతాడని , వినయ్ భాస్కర్ నిబద్ధత గల నాయకులు అని అన్నారు. తెల్లారి లేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ భాస్కర్ ఓడిపోవటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది, వినయ్ భాస్కర్ అన్న గతంలోనే మంత్రి కావాల్సినవాడు, ఓరుగల్లు కేంద్రంగా ఉద్యమాన్ని నడిపిన ముఖ్య నాయకుడు వినయ్ భాస్కర్ అన్న అని అన్నారు. వినయ్ అన్నను 2006 నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి వివిధ హోదాలో ఉన్నప్పుటి నుంచి చూస్తూ వస్తున్న అని, ఆయన ఓటమికి కారణం మనం చేసింది చెప్పుకోలేక పోవటమేనని తెలుసుకున్నా అని మాట్లాడారు.