ఫారెస్ట్ సెక్షన్ అధికారి పై సస్పెన్షన్ వేటు..

by Sumithra |   ( Updated:2023-05-27 11:18:43.0  )
ఫారెస్ట్ సెక్షన్ అధికారి పై సస్పెన్షన్ వేటు..
X

దిశ, కొత్తగూడ : అవినీతికి పాల్పడుతూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కొత్తగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముక్బుల్ ను సస్పెండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్ భీమానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడ అటవీశాఖలో అవినీతి జలగలా అవతారం ఎత్తినట్లు ఆరోపణలున్నాయి. కొత్తగూడ సెక్షన్ ఆఫీసర్ గా బదిలీ పై వచ్చిన రోజు నుండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కొత్తగూడ పరిధిలోని అటవీశాఖ భూముల్లో బోరుబావి యజమానులతో కుమ్మక్కై అనుమతులిచ్చినట్లు ముక్బుల్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గూడూరు ఎఫ్డీఓ చంద్రశేఖర్ విచారణ జరిపారు. బోరు యజమానుల నుంచి డబ్బులు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణల పై ఆధారాలు సేకరించారు. ఎఫ్డీఓ విచారణ నివేదికను సీసీఎఫ్ భీమానాయక్ కు అందజేశారు. నివేదికను పరిశీలించిన సీసీఎఫ్ భీమానాయక్ కొత్తగూడ ఫారెస్ట్ సెక్షన్ అధికారి ముక్బుల్ ను సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story