కరోనా కష్టకాలంలో ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం : దాస్యం వినయ్ భాస్కర్

by Aamani |   ( Updated:2023-11-18 11:54:36.0  )
కరోనా కష్టకాలంలో ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం : దాస్యం వినయ్ భాస్కర్
X

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంటీరియర్ డిజైనర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుండి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఎన్నో ఏళ్లుగా కూలీలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ నమస్కారం తెలిపారు. మీరందరూ కూడా పనివాళ్ళు కాదని నా ఇంటి వాళ్ళని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం వారి యొక్క బాగోగుల విషయంలో అనేక పథకాలను అందించి అండగా నిలిచిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడున్న మీకు కొన్ని సమస్యలు ఉన్నాయని కొన్ని సమస్యలు నెరవేరాయని ఇంకా కొన్ని సమస్యలు అలానే ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. అందరికి ఉపాధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని కార్మికుల యొక్క భాగాకుల కోసం మే నెలలో నెల మొత్తం కార్మిక మాసోత్సవాన్ని నిర్వహించి కార్మికుల యొక్క అభివృద్ధి సంక్షేమం దిశగా పనిచేశానన్నారు. కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి విద్యాపరంగా అదే విధంగా వైద్య పరంగా అనేక సహాయ సహకారాలు అందించానన్నారు.

లేబర్ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను కూడా ఇచ్చామని ఇంకా కొంతమందికి ఇచ్చేవారు ఉన్నారని వారిని జనవరిలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి హెల్త్ కార్డులు ఇస్తానని అన్నారు. కార్మికుల నిరంతరం కానీ కష్టపడి పని చేస్తారని వారికి కచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి కాబట్టి వారికి ఉచితంగా అనేక లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను కూడా అందిస్తున్నామని తెలిపారు. మీకు ఎటువంటి ఆపద వచ్చినా, మీకు కష్టం వచ్చినా మీకు వినయ్ అన్న అండగా ఉన్నాడని చెప్పండి అని అన్నారు. కరోనా సమయంలో ఏ పార్టీ పట్టించుకోకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకుందని అన్నారు. వలస కార్మికులని చూడకుండా సొంత మనుషుల్లాగా చూసినటువంటి కెసిఆర్ రవాణా సౌకర్యాలు ఇచ్చి భోజన వసతులు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నాడని అన్నారు. సహాయం చేసిన పార్టీని మరువమని అన్నారు. సుమారు 1500 మంది స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు. భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నామని, 50 వేలకు పైచిలుకు మెజారిటీ రాబోతుందని ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధిక్, సోను, సహిద్, సలీం,బాబా, అజాద్,సాజిద్ అలీ,అనూప్,వహిద్,సందీప్,మనోజ్,మున్ని లాల్,శిబు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed