- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంచనపల్లి పీఎసీఎస్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ..
దిశ, రఘునాథపల్లి : కంచనపల్లి పీఎసీఎస్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ చీమలపాటి రవీందర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లు అవిశ్వాసం మోపారు. గతనెల జిల్లాకలెక్టర్ ఎడిషన్ కలెక్టర్లను కలిసి చైర్మన్ పై విశ్వాసం పెడుతున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో కొందరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి అవిశ్వాసానికి లేక ఇచ్చిన వారిలో ఉన్నారు. కానీ తీరా అవిశ్వాస పరీక్ష నిర్వహించేసరికి కాంగ్రెస్ పార్టీకార్యకర్తలు పూర్తిగా గైర్హాజరయ్యారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లంతా క్యాంపులో ఉన్నారు. బుధవారం అధికారులు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి బలపరీక్ష నిర్వహించారు.
కానీ ఏ ఒక్కరూ హాజరు కాలేదు. అధికార పార్టీకి చెందిన డైరెక్టర్లు ఆరుగురు క్యాంపులో ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరోఆరుగురు బలపరీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో అవిశ్వాస బలపరీక్ష వీగిపోయింది. దీంతో చైర్మన్ రవీందర్ ఊపిరిపీల్చుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లంతా చైర్మన్ తో కుమ్మక్కైనట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. లేకపోతే అవిశ్వాస బలపరీక్షకు నోటీస్ ఇచ్చి, బలపరీక్ష రోజున ఏ ఒక్కరూ హాజరు కాకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈ బలపరీక్ష నిర్వహణకు డీసీఎస్ అధికారులు రవి కిరణ్, వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.