- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర పై కడియం శ్రీహరి ఫిర్యాదు
దిశ, జనగామ : స్టేషన్గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సింగపురం ఇందిర పై స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ రామ్మూర్తికి, సీఐ రాజుకు శుక్రవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు, అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో, మతం పేరుతో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ కడియం శ్రీహరి కులం గురించి కూడా మాట్లాడిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
అదేవిధంగా తాను ఎన్కౌంటర్లో సృష్టికర్త అని తన పై నిందలు వేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా కులం పేరు చెప్పి ఓట్లు అడిగారని కూడా ఆయన ఆ ఫిర్యాదులో వివరించారు. ఎన్నికల నియమావళిని అనుసరించి ఇందిర పై కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని ఆయన అధికారులను కోరారు. దీంతో ఒక్కసారిగా స్టేషన్గన్పూర్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ విషయం పై రిటర్నింగ్ అధికారి రామ్మూర్తి, ఘనపూర్ సీఐ రాజు ఇతర అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా స్టేషన్గన్పూర్ లో మాత్రం ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. దీని పై ఏసీబీ శ్రీనివాస్ రావును సంప్రదించగా ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు.