- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్వాలా ట్రస్టుకు ‘ హానరరీ డాక్టరేట్ ’ అవార్డు..
దిశ, మంగపేట : ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా ’ అన్న సామెతకు భిన్నంగా ‘ఎవరూ పిలవకున్నా ఏమీ ఇవ్వకున్నా’ ఆపదలో ఉన్నామంటే అక్కడ వాలి తమకు తోచిన సహాయం అందిస్తుంది. 11 సంవత్సరాలుగా చేసిన నిస్వార్థ సేవకు ‘జ్వాల యూత్, జ్వాలా ట్రస్టు’కు ఆసియా ఇంటర్ నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ( ఇంటర్ నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్, ఐఏవో) మేనేజ్ మెంట్ ‘హానరరీ డాక్టరేట్’ అవార్డును గురువారం ప్రకటించినట్లు ట్రస్టు చైర్మన్ కోడెల నరేష్ తెలిపారు. 2013న కొందరు యువకులతో ఏర్పాటు చేసిన జ్వాలా యూత్ దశాబ్ద కాలంగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సామాజిక కార్యక్రమాలను చేపట్టింది.
2019 కోవిడ్ సమయంలో మొదటి, రెండవ దశలో ఎందరో కోవిడ్ బారిన పడ్డ యువతీ యువకులను తన హక్కున చేర్చుకుని వైద్యంతో పాటు మండలంలోని 25 పంచాయతీల్లోని ప్రతి గ్రామంలో ఇళ్లిల్లు తిరిగి వారికి అన్న పానీయాలు అందించి అరుదైన గౌరవం పొందారు. రక్తదాన శిభిరాలు, మహా అన్నదానాలు, ఉచిత వైద్యశిభిరాలు, ఉచిత మందుల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. ఆపదలో ఉన్న అనేక మందికి వాట్సప్ గ్రూపుల ద్వారా వారి దీన బాధలను తెలిపి వేలాది రూపాయలను డొనేట్ చేసి ప్రాణాలు కాపాడినట్లు నరేష్ తెలిపారు. దశాబ్ధ కాలానికి పైగా జ్వాలా యూత్, ట్రస్టుల ద్వారా చేసిన సేవలను గుర్తించి ఆసియా ఇంటర్ నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ( ఇంటర్ నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్, ఐఏవో) మేనేజ్ మెంట్ ‘హానరరీ డాక్టరేట్’ అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నట్లు చైర్మన్ కోడెల నరేష్ తెలిపారు.