అలర్ట్: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

by Disha News Web Desk |
అలర్ట్: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తాజాగా.. ఏకంగా జిల్లాలో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 324కు చేరాయి. గురువారం జిల్లాలో 1187 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 125 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయితే, జిల్లాలో రోజురోజుకూ కేసులో పెరుగుతుండటంతో జనాలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి పకడ్బంధీ చర్యలు తీసుకోవడం లేదని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు యథావిధంగా నడుస్తుండటంతో వ్యాధి వ్యాపిస్తున్నదని పలువురు అనుకుంటున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story