ఏజెన్సీలో పోలీసుల ఉక్కు పాదం

by Disha Web Desk 15 |
ఏజెన్సీలో పోలీసుల ఉక్కు పాదం
X

దిశ, కొత్తగూడ : పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏజెన్సీలో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం కోడ్‌ అమల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలంలో సమస్యాత్మక గ్రామాలపై మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథ్​ కేకన్ ఆదేశాల అనుసారం పోలీసుశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుంది. శనివారం కొత్తగూడ మండల కేంద్రంలో గూడూరు సీఐ బాబు రావు ఆధ్వర్యంలో కొత్తగూడ గంగారం ఎస్సైలు దిలీప్, రవికుమార్ లు వాహనాలు తనిఖీ చేస్తుండగా కొత్తగూడ మండలంలోని ఎంచగూడెం గ్రామానికి చెందిన రోడ్లకంటి అనిల్ రెడ్డి వద్ద లక్ష 37 వేల 700 నగదు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తునందున,

డబ్బులను పంచనామా చేసి ములుగు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్స్ కి పంపించారు. ఈ సందర్బంగా గూడూరు సీఐ బాబురావు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. నగదు, మద్యం ఉచిత పంపిణీ పై ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుందని, ఎవరూ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగవద్దని, పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. సరైన ఆధారాలు లేకుండా

రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులను తీసుకెళ్తే సీజ్ చేస్తామని, గత ఎన్నికల్లో అల్లర్లు, సమస్యలను సృష్టించిన వారిపై నిఘా పెట్టామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ఇక ఎన్నికలను పాదర్శకంగా నిర్వహించటంలో భాగంగా ఫ్లయింగ్‌, స్టాటిక్‌, వీడియో సర్వేయలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన సీ విలేజ్‌ యాప్‌ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమం ఫ్లయింగ్ స్కాడ్​ చెన్న కేశవరెడ్డి, ఏఎస్సై లక్ష్మి రంగయ్య, కానిస్టేబుల్ లు ప్రశాంత్, భరత్, కిషోర్, శ్రవణ్,సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed