- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SBI: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో కొలువుల జాతర
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు సంస్థలో 12 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. ఐటీ, ఇతరత్ర డిపార్ట్‌మెంట్లలో నియమకాలకు నోటిఫికేషన్ వేయబోతున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులను ఎంపిక చేసి కామన్ స్టాఫ్, అసోసియేట్ స్టాఫ్‌గా దాదాపు 85 శాతం మంది ఇంజనీర్లు ఉండే వ్యవస్థను తయారు చేయబోతున్నామని తెలిపారు. అందరికీ బ్యాంకింగ్‌ను అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, బ్యాంక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,35,858 నుంచి 2,32,296కి పడిపోయిందని అన్నారు. టెక్నికల్ స్కిల్స్ కోసం కొత్త ఉద్యోగులను కూడా బ్యాంకు ప్రత్యేకంగా తీసుకోవాలని నిర్ణయించినట్లుగా ఆయన వెల్లడించారు.