ఆరు గ్యారెంటీలపై మాట తప్పిన కాంగ్రెస్

by Disha Web Desk 15 |
ఆరు గ్యారెంటీలపై మాట తప్పిన కాంగ్రెస్
X

దిశ, సంగారెడ్డి : ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని అమలు చేయకపోగా దేవుళ్ల మీద ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలు చేయకపోవడం వల్ల వారిని అందుకే ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ కిట్ బంద్ అయిందని, కల్యాణ లక్ష్మి రావడం లేదు,

పింఛన్లు రావడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో కళ్యాణలక్ష్మీ రూ.లక్ష తో పాటు తులం బంగారం ఇస్తా అని మాట తప్పారని, మహా లక్ష్మి కింద రూ. 2500 ఇస్తా అన్నారు కానీ ఆ హామీ నెరవేరలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు, చెల్లికి రూ. 12 వేలు బాకీ పడిందని, లక్ష తులాల బంగారం బాకీ పడిందన్నారు. హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే జనాలు రాలేదని, రాహుల్ మీటింగ్స్ జనం లేక వెల వెల బోతున్నాయన్నారు. అదే కేసీఆర్ మీటింగ్స్ మాత్రం ఇసుక వేస్తే రానంత జనం ఉంటున్నారన్నారు. హమీలు అమలు చేయడంలో విఫలమైనందున రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్ని మాటలు చెప్పినా రాహుల్ గాంధీని ప్రజలు నమ్మడం లేదన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో పారాచూట్ నేతలకు టికెట్ ఇవ్వము అన్నారు. కానీ మెదక్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లలో వాళ్లకే టికెట్ ఇచ్చారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన లోకల్ వ్యక్తి అని, ఎమ్మెల్సీగా ఉండే వెంకట్రామి రెడ్డికి టికెట్ ఎలా ఇచ్చావు అంటున్నారు రేవంత్ రెడ్డి అని, ఎమ్మెల్సీ గా ఉన్న జీవన్ రెడ్డి, దానం నాగేందర్ కు ఎందుకు ఇచ్చావని ప్రశ్నించారు.

బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే...

బీజేపీకి ఓటు వేస్తే మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్లేనని హరీశ్ రావు అన్నారు. దుబ్బాకలో రఘునందన్ రావును అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. పేదల అకౌంట్లలో కేంద్ర బీజేపీ డబ్బులు వేస్తం అన్నది అని, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. శత చండీ యాగం చేసింది కేసీఆర్ కు గుండెలో భక్తి ఉంటుందని, కేసీఆర్ కంటే మించిన భక్తుడు ఎవరూ లేదని, వాళ్ళది ఓట్ల కోసం భక్తి మాత్రమే అన్నారు.

వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తా : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఓటమి భయంతో ఫేక్ ప్రచారం చేస్తున్నాడని, గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతుండని విమర్శించారు. ప్రజాసేవ చేసేందుకు తాను రాజకీయంలోకి వచ్చానని, పది లక్షల ప్రమాద బీమా అర్హులందరికీ ఉచితంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాసాల బుచ్చిరెడ్డి, మందుల వరలక్ష్మీ, రషీద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed