తిరుమలలో రెండు చిరుతల కలకలం.. భయాందోళనలో భక్తులు

by srinivas |   ( Updated:2024-05-20 14:46:36.0  )
తిరుమలలో  రెండు చిరుతల కలకలం.. భయాందోళనలో భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు కలకలం రేగింది. అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు రెండు చిరుతపులులు ఉన్నట్లు గుర్తించారు. చెట్ల పొదల్లో ఉండటంతో భయంతో భక్తులు అరుపులు, కేకలు వేశారు. వెంటనే చిరుతలు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. అయితే మళ్లీ వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుతలను బంధించేందుకు చర్యలు చేపడుతున్నారు. అప్పటి వరకూ భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా మెట్ల మార్గంలో వెళ్లొద్దని, గుంపులు, గుంపులుగా తిరుమల కొండకు చేరుకోవాలన్నారు. భక్తులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని.. చిరుతలను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వృద్ధులు, చిన్నారులను భక్తులు తమ వెంటనే తీసుకెళ్లాలని సూచించారు.

ఇప్పటికే పలుమార్లు చిరుతలు తిరుమలలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. భక్తులపై దాడి చేసి గాయపర్చిన ఘటనలు కలవరపెడుతున్నాయి. ఐదు రోజుల క్రితమే చిరుతను తిరుమల ఘాట్ రోడ్డులో ఓ భక్తుడి కారుకు చిరుత అడ్డొచ్చింది. ఆ దృశ్యాలు సీసీ పుటేజీ‌లో కనిపించాయి. గతంలో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలోనూ చిరుతలు కనిపించాయి.

Read More...

Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

Advertisement

Next Story

Most Viewed