గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో అధికార దుర్వినియోగం: ఈటల

by GSrikanth |   ( Updated:2024-05-20 14:02:28.0  )
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో అధికార దుర్వినియోగం: ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖమ్మం జిల్లాలో ఈటల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. విద్యార్థులు చదువుకునే కాలేజీ మైదానాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఓటు వేయాలని అడుగున్నట్లు తెలిపారు. టీఎస్ డయాగ్నోస్టిక్ సెంటర్లలోని సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవని అన్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు కూడా రావట్లేదని తెలిపారు.

కేజీవీబీల్లో సీఆర్టీసీలకు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త నియామకాలు లేకపోవడంతో వర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ తాము సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఖమ్మం, నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని అమిత్ షా మాట్లాడారని.. అదే నిజం కాబోతోందని అన్నారు.

Read More...

ఢిల్లీ లిక్కర్ కేసు: MLC కవితకు మరోసారి బిగ్ షాక్

Advertisement

Next Story