- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటు వేయని వారినుంచి అధిక పన్నులు వసూలు చేయాలి: పరేష్ రావెల్
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ సోమవారం ఉదయం ముంబైలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సందర్భంగా ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండేవారి నుంచి అధిక పన్నులు వసూలు చేయాలి లేదంటే ఇతర శిక్షలు వంటి కఠిన నిబంధనలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటు ప్రాముఖ్యత గురించి మాట్లాడిన ఆయన, 'మీరు ఓటు వేయకుండా ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు అని ఫిర్యాదులు చేస్తారు. ఓటు వేయకపోతే అందుకు బాధ్యత ప్రభుత్వానిది కాదు, మీరే బాధ్యులవుతారు ' అని తెలిపారు. ప్రభుత్వ విధుల గురించి అన్ని సందర్భాల్లో మాట్లాడే వారు తమ హక్కు పట్ల కూడా బాధ్యతగా ఉండాలన్నారు. ఓటు వేయడానికి దూరంగా ఉండేవారికి సరైన జరిమానాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఐదో దశ ఎన్నికల సందర్భంగా ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.