- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడియం ర్యాలీలో ..పల్లా నాయకత్వం వర్ధిల్లాలి.. నినాదాలు
దిశ,జనగామ: బీఆర్ఎస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ టికెట్ ను కడియం శ్రీహరికి కేటాయించిన తర్వాత మొట్టమొదటి సారిగా హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి శ్రీహరి కి నెల్లుట్ల క్రాస్ రోడ్ వద్ద పార్టీ నాయకులు,కార్యకర్తలు బుధవారం పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కడియం జనగామకు చేరుకోగా పార్టీ వర్గాలు స్వాగతం పలికాయి. స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అయితే ఈ ర్యాలీ నెల్లుట్ల మీదుగా యశ్వంతపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు చేరుకోగా ఒక్క సరిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పల్లా నాయకత్వం వర్ధిల్లాలి.. జై పల్లా.. జై జై పల్లా.. అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. కాగా చైతన్య రథం పైన కడియం శ్రీహరి తో పాటుగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి,పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి తదితరులు తరలివచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తునే ర్యాలీ ముందుకు సాగాల్సిందిగా సూచించారు. ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య టికెట్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తర్వాత మొట్టమొదటి సారిగా జిల్లాకు వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కార్యకర్తల నినాదాలు ఆయనను ఉత్సాహాన్ని నింపిన ట్లు చేశాయి.
రఘునాథపల్లి లో...
అనంతరం ఈ ర్యాలీ రఘునాథపల్లి మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్ చేరుకుంది. రఘునాథపల్లిలో కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి కడియం,పల్లాలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లింగాల గణపురం జడ్పిటిసి, గుడి వంశీ చందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మారిజోడు రాంబాబు, చెంచు రమేష్, హుస్సేన్, శ్రీనివాస్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.