- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రహదారుల నిర్మాణాన్ని గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు.. పట్టించుకోని అధికార యంత్రాంగం
దిశ, ములుగు ప్రతినిధి: ఏజెన్సీ జిల్లాగా పిలవబడుతూ ఇప్పుడిప్పుడే ప్రగతిపథంలోకి అడుగుపెడుతున్న ములుగు జిల్లాలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారారు. అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించే రహదారుల నిర్మాణానికి కాంట్రాక్టర్లు బ్రేకులు వేశారు. జిల్లాలో పేరుందిన కాంట్రాక్టర్లు జిల్లా అంతర్గత రహదారి నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు దక్కించుకొని పనులు మొదలుపెట్టి పాత రోడ్డుపై ఉన్న తారును తీసేసి కంకరతో చదును చేసి పాత బకాయిలు గవర్నమెంట్ చెల్లించట్లేదు అంటూ పనులను ఎక్కడికి అక్కడ ఆపేసి పాత బిల్లులు రావట్టుకునేందుకు పథకం వేశారు. గతంలో చేసిన పనులకు బిల్లు చెల్లించాకే పనులు తిరిగి ప్రారంభిస్తామంటూ మొండికేసి కూర్చోవడంతో జిల్లాలో అభివృద్ధికి బ్రేకులు వేసినట్టు అయింది. కాంట్రాక్టర్ల తమ స్వలాభం కోసం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేడుక చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మధ్యలో ఆగిన రహదారి నిర్మాణాలు..
ములుగు జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో రహదారి నిర్మాణాల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు కేటాయించారు. కాంట్రాక్టర్లు మాత్రం సగం రోడ్డు నిర్మాణాలు చేసి మధ్యలో పనులు నిలిపివేయడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్డు భవనాల శాఖ నుంచి ఆరు నెలలుగా ములుగు మండలంలోని శ్రీనగర్ నుంచి కుడిశెలకుంట వరకు మొదలుపెట్టిన రోడ్డు పనులతో పాటు పందికుంట క్రాస్ నుంచి రామచంద్రాపురం వరకు నిర్మించనున్న రోడ్డు పని మొదలుపెట్టి రోడ్డుపై కంకర వేసి వదిలిపెట్టగా ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ములుగు నుండి పత్తిపల్లి వరకు నిర్మించే రహదారులు కొంత భాగం పూర్తిచేసి మిగతాది కంకర వేసి వదిలేయటం, పంచాయతీరాజ్ శాఖ నుంచి రామప్ప నుంచి నల్లగుంట వరకు వేయవలసిన తారు రోడ్డు ఆరు నెలలుగా కంకర తోనే దర్శనం ఇవ్వటం ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఇంకా ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న బీటీ రోడ్లు పనులు అర్ధాంతరంగా నిలిపి కాంట్రాక్టర్లు తమకు రావలసిన పాత బకాయిల కోసం వేచి చూస్తున్నట్టు జిల్లాలో చర్చ జరుగుతుంది.
జిల్లాలో ఆ నలుగురు కాంట్రాక్టర్లదే హవా..
ములుగు జిల్లాలో రోడ్డు పనులకు టెండర్లు ఆ నలుగురే కాంట్రాక్ట్ దక్కించుకోవడం వల్లే ఇప్పుడు జిల్లాలో రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, జిల్లా వ్యాప్తంగా ఏ రోడ్డు నిర్మాణానికైనా ఆ నలుగురికే కాంట్రాక్టు ఇవ్వటం వల్ల ఆ కాంట్రాక్టర్లందరూ కూడగట్టుకొని ఇప్పుడు కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాత బిల్లులు రాబట్టుకునేందుకు పనును నిలిపివేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. పాత బిల్లుల వంకతో రోడ్డు నిర్మాణం మధ్యలో ఆపడం వల్ల సామాన్యులకే నష్టం జరుగుతోందని, సంవత్సరాల పాటు కాలయాపన చేయటం వల్ల రహదారి నిర్మాణ వ్యయం పెంచుకొని మళ్లీ పనులు మొదలు పెట్టవచ్చని కాంట్రాక్టర్లు తమలాభం కోసమే ఇదంతా చేస్తున్నారని మేధావులు భావిస్తున్నారు.
కాంట్రాక్టర్లపై చర్యలు ఉంటాయా..
ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లో రహదారుల నిర్మాణం గాలికి వదిలేసి పాత బిల్లుల కోసం పరితపిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తాము చేయకుండా ఇతర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని చెప్పకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని రోడ్డు పనులు మొదలుపెట్టి మధ్యలో పనులు నిలపడం వల్ల కంకర రహదారులతో వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటి కాంట్రాక్టర్లపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.