బీఆర్ఎస్‌లో భేదాభిప్రాయాలు ఉంటే కూర్చుని సమస్యలను పరిష్కరించుకొండి : మాజీ మంత్రి తుమ్మల

by Aamani |   ( Updated:2023-05-12 12:15:23.0  )
బీఆర్ఎస్‌లో భేదాభిప్రాయాలు ఉంటే కూర్చుని సమస్యలను  పరిష్కరించుకొండి : మాజీ  మంత్రి తుమ్మల
X

దిశ, బయ్యారం: బీఆర్ ఎస్ పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే కూర్చుని సమస్యలను పరిష్కరించుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.సీతారామ ప్రాజెక్టు నుంచి బయ్యారం పెద్ద చెరువు లిప్టు ద్వారా నీరు దించేందుకు కృషి చేస్తామని, దీనికి అదనంగా మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని దీని వలన నియోజక వర్గంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఒక లక్ష పది వేల ఎకరాలకు నీరందించేందుకు ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామన్నారు.ఎన్నికల కు సిద్దకండి మన బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లకు పది బీఆర్ ఎస్ ను గెలిపించుకోవాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పిలుపు నిచ్చారు .

మండల కేంద్రంలోని శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా పంటలు పండిస్తూ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదని , ఒరిస్సా, జార్ఖండ్ , మహారాష్ట్ర ప్రజలు దేశానికి కేసీఆర్ లాంటి నాయకుల పాలన కావాలని ఆశ పడుతున్నారని , కార్యకర్తలు మరింత కృషి చేయాలని, మండలం లో గతంలో ఏ నాయకుడు బయ్యారం చెరువు అభివృద్ధి చేయలేదని , రైతులు కాలువ పనులు చేయాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని , దీనిపై ముఖ్యమంత్రి తో మాట్లాడి మండల అభివృద్దికి నా వంతు సహకరిస్తానని హమీ ఇచ్చారు. ప్రతిపక్ష మాటలు ఎవరు లెక్క చేయవద్దని తెలిపారు . గతంలో నేషనల్ హైవే రోడ్డు వలిగొండ నుండి తొర్రూరు ను కలుపుతూ కొత్తగూడెం వరకు రోడ్డు పనులు తమ కృషి వలన సాద్యమైందని తెలిపారు. మూడోసారి బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందకు కార్మికులుగా పని చేయాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాత గణేష్, సొసైటి అద్యక్షుడు మధూకర్ రెడ్డి , ఎంపిపి చేపూరి మౌనిక , సర్పంచ్‌ కోటమ్మ , ఇతర నేతలు కార్యకర్తలు శ్రీకాంత్, రాంమూర్తి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed