చినుకు పడితే బడి చిత్తడే.. చెరువును తలపించేలా పాఠశాల

by Aamani |
చినుకు పడితే బడి చిత్తడే..  చెరువును తలపించేలా పాఠశాల
X

దిశ,తొర్రూరు: ఆ పాఠశాల విద్యార్థులకు ఎప్పుడూ టెన్షనే. వర్షం పడితే కూర్చొని అన్నం తినేందుకు సరైన స్థలం ఉండదు. ఆవరణలోకి వెళ్లి కాసేపు ఆడుకుందామంటే చెరువును తలపించేలా నీరు వచ్చింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల అవస్థలివి. వర్షం పడితే చెరువును తలపించేలా ప్రభుత్వ పాఠశాల మారడంపై ఉన్నతాధికారులు దృష్టి సాధించడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కూర్చొని భోజనం చేయుటకు స్థలం నీటితో నిండి... దానిపై ఈగలు దోమలు వాలడంతో పిల్లలకు సీజనల్ వ్యాధులకు దారితీస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

పిల్లలకు వ్యాధులు వ్యాపించే అవకాశం..

చెరువును తలపించేలా తొర్రూరు జిల్లా పరిషత్ పాఠశాల తయారవుతుంది. పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వర్షాకాల సమయం లో వర్షపు నీరు పాఠశాలలో చేరి విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో కూర్చొని అన్నం తినడానికి వీలుగా లేకుండా వర్షపు నీరు చేరి చెరువును తలపించేలా కనిపించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వర్షాకాలం కాబట్టి విద్యార్థులకు సీజనాధులు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో నీరు నిలువ లేకుండా చేయాలని మరియు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

విద్యార్థులకు వసతులు కల్పిస్తాం : మంగళపల్లి రామచంద్రయ్య మున్సిపల్ చైర్మన్

జిల్లా పరిషత్ పాఠశాలలో వర్షపు నీరు నిల్వ కావడంతో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపడతాం. అదేవిధంగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తాం. అదేవిధంగా పాఠశాలలో శానిటైజేషన్ చేపించి పరిశుభ్రంగా ఉంచే విధంగా చేపడతాం. అదేవిధంగా మీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు కూడా చేపడతాం.

Advertisement

Next Story

Most Viewed