- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షార్ట్ సర్క్యూట్ తో జీపీ భవనం దగ్ధం..?
దిశ, నెక్కొండ: షార్ట్ సర్క్యూట్ వల్ల జీపీ భవనం దగ్ధమైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికెర గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ, జీపీ నల్లా నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. పండగ రోజులు దగ్గర పడుతుండడంతో జీపీ సిబ్బంది మరమ్మతుల కోసం నల్లాల బావుల వద్దకు వెళ్లినట్టు సమాచారం. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామ సచివాలయంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న దుర్గామాత మలాధారులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో గ్రామ పంచాయితీలోని విలువైన రికార్డులు,ఫైల్స్,పలురకాల దరఖాస్తులు,ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యాయి.ఎంపిడిఓ దయాకర్ ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జీపి కార్యదర్శి ప్రియాంక, లైన్మెన్,జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.