- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Godavari : మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గర్లో గోదావరి
దిశ, ములుగు ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ములుగు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ములుగు జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో శుక్రవారం రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గోదావరి తీరప్రాంతాల గ్రామాల్లో వాగులు,వంకలు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో 83 మీటర్ల మేర నీటిమట్టం పెరగగా అన్ని గేట్లు ఎత్తేసి 1045290 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వేటూర్ నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు
వద్ద గోదావరి నీటిమట్టం 74.48 మీటర్లు ఉండగా 75.82 మీటర్లకు నీటిమట్టం చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ములుగు జిల్లాలోని జాతీయ రహదారి 163 పై కడేకల్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో తెలంగాణ-చత్తీస్ఘడ్ సరిహద్దు టేకులగూడెం వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి ఉధృతి తో స్టేట్ హైవే 12 పై వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారి పై కొండాపురం , వీరభద్రవరం గ్రామాల సమీపంలోని జిన్నేల వాగు కుక్కతొర్రి వాగుల వద్ద వరద నీరు చేరడంతో అధికారులు తాత్కాలికంగా రాక పోకలు నిలిపి వేశారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గోదావరి తీరప్రాంతాల్లో పర్యటించి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు.
- Tags
- Godavari