ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్..

by Kalyani |
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్..
X

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ పరిసర ప్రాంతాలలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 5.5 లక్షల నగదును, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్, టౌన్ పోలీసులు గత కొన్ని రోజులుగా క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే సోమవారం నమ్మదగిన సమాచారంతో క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహించే వ్యక్తులపై టాస్క్ ఫోర్స్ అండ్ సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురు నిందితులు ఏలూరుకు చెందిన వలగాని రామకృష్ణ, ఖమ్మం పట్టణానికి చెందిన తొట్టెంపూడి విక్రమ్, చార ప్రవీణ్ కుమార్, గుంటూరు జిల్లాకు చెందిన ఆనంద్ కిరణ్ లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు కొద్ది రోజులుగా మహబూబాబాద్ పట్టణంలో బెట్టింగ్ లకు పాల్పడుతూ యువతను బెట్టింగ్ ల వైపు ప్రోత్సహించే విధంగా ప్రచారం చేస్తూ పట్టుబడడం జరిగిందని వీరు భుకీలుగా వ్యవహరిస్తూ చైన్ లింకింగ్ సిస్టం ద్వారా బెట్టింగ్ సిస్టం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలలో బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఈ కేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు బీ.సంతోష్ , సీహెచ్. రమేష్, కానిస్టేబుల్ వెంకన్న, కోటేశ్వరరావు, రామకృష్ణ, దిలీప్, వీరస్వామిలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డు అందజేయడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed