కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ITDA ఏర్పాటు : మాజీ కేంద్ర మంత్రి

by Dishaweb |   ( Updated:2023-08-28 09:42:32.0  )
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  ITDA ఏర్పాటు : మాజీ కేంద్ర మంత్రి
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనపురం అంజయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ హజరైయ్యారు. బలరాం నాయక్ మాట్లాడుతూ దళిత,గిరిజనుల ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు.శనివారం చేవెళ్ల లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు 12 హామీలు ఇచ్చారు.

1) ఎస్సీ రిజర్వేషన్ల పెంపు : ఎస్సీ వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% కి పెంపు. ఎస్సీ రిజేర్వేషన్లో ఏబీసీడీ వర్గీకరణ అమలుకై గట్టి చర్యలు

2) అంబేద్కర్ అభయహస్తం: ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ॥ 12 లక్షల ఆర్ధిక సహాయం అందజేత. వచ్చే 5 సం॥రాల్లో ప్రతి బడ్జెట్ లో సరిపడ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పథకం అమలు.

3) ప్రత్యేక రిజర్వేషన్లు: అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ పోత్సాహకాలను పొందే ప్రయివేట్ కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన

4) ఇందిరమ్మ పక్క ఇండ్ల పథకం: ఇళ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటిస్థలం ఇంటి నిర్మాణానికి రూ॥ 6 లక్షలు అందజేత ఐదేండ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు.

5) అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు: బీఆర్ఎస్ సర్కార్ లాక్కున్న ఎస్సీ, ఎస్టీ ల అసైన్డ్ భూములన్ని తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునర్ధురణ. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహరం.

6) పోడు పట్టాల పంపీణీ : సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికి పోడు భూముల పట్టాలు పంపీణి.

7) సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం: ఈ పథకం క్రింద ప్రతి గూడెం. తండా గ్రామ పంచాయితీలకు ఏటా రూ॥ 25 లక్షలు కేటాయింపు

8) 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు : మాదిగ, మాల ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఒక్కొ కార్పొరేషన్ కు రూ॥ 750 కోట్ల నిధుల మంజూరు.

9) 3 ఎస్టీ కార్పోరేషన్ల ఏర్పాటు తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడ కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్ల ఏర్పాటు ఏటా ఒక్కొ కార్పోరేషన్కు రూ॥ 500 కోట్ల నిధుల కేటాయింపు.

10) 5 కొత్త ఐ.టి.డి.ఎ. లు, 9 కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐదు జిల్లాల్లో కొత్త ఐ.టి.డి.ఎ.ల ఏర్పాటు అన్ని ఐ.టి.డి.ఎ ల కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల స్థాపన.

11) విద్యా జ్యోతుల పథకం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే రూ॥ 10,000/-, ఇంటర్ పాస్ అయితే రూ॥ 15,000/- గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ॥ 25,000/-, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ॥ 1,00,000/- అందజేత. ఏం ఫీల్ ,పీహెచ్డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ॥ 5,00,000/- అందజేత.

12) రెసిడెన్షియల్ మస్కూళ్లు, హాస్టల్స్ మరియు విదేశాల్లో విద్య : ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు.ఫీజ్ రీయంబర్స్మెంట్ పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టడంతో పాటు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికి హాస్టల్ సదుపాయ కల్పన. విదేశాల్లో యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత.ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఎదల్ల.యాదవ రెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ నాయక్,మాజీ జెడ్పీటీసీ హెచ్.వెంకటేశ్వర్లు,TPCC ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబాల శివ కుమార్,నెల్లికుదురు మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్,వార్డు కౌన్సిలర్ శ్రీను నాయక్,సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ సామ మధుసూదన్ రెడ్డి, నెల్లికుదుర్ మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ గౌడ్,మండల నాయకులు, భరత్,రాకేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story