'దిశ' ఎఫెక్ట్.. వాటిని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు

by Vinod kumar |
దిశ ఎఫెక్ట్.. వాటిని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఎర్రగట్టమ్మ సమీపంలోని అటవీ శాఖ సంబంధించిన ప్రదేశం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 17,18 తేదీల్లో ములుగు జిల్లాలో అక్రమంగా మట్టిని తరలించి వ్యాపారంగా మలుచుకున్న అంశంపై 'దిశ' దిన పత్రికలో ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన అటవీ శాఖ ఆదివారం రాత్రి సమయంలో ఎర్రగట్టమ్మ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి 4 టిప్పర్ల ద్వారా అనుమతి లేకుండా మట్టి తరలిస్తుండగా ములుగు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న నాలుగు టిప్పర్ల ను ములుగు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఉంచి.. కేసు నమోదు చేశారు.

అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు.. ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్


అటవీ ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా మట్టిని సేకరించి తరలించిన వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవు. అక్రమంగా మట్టిని తరలిస్తే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.

Next Story

Most Viewed