పోటెత్తిన వరద.. జల దిగ్బంధంలో గ్రామాలు

by Dishaweb |   ( Updated:2023-07-27 11:07:58.0  )
పోటెత్తిన వరద.. జల దిగ్బంధంలో గ్రామాలు
X

దిశ, మల్హర్: ఆరేవాగు తీగల వాగు ఉధృతంగా ప్రవహించి మానేరు నదికి పోటెత్తడంతో మండలంలోని మల్లారం, దబ్బ గట్టు, చిన్నతూoడ్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ఇండ్లు జలమయమయ్యాయి. బాధితులు ఇంట్లోని కొన్ని సామాన్లు నెత్తిన పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఎగువ నుంచి ప్రవహించిన వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ఆరే వాగు, తీగల వాగు నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న మానేరు నది పోటెత్తడంతో రివర్స్ అయినా వరద నీరు గ్రామాలను ముంచేస్తుంది. ఒక్కసారిగా వరద నీరు ఇండ్లలోకి చేరడంతో బాధితులు లబోదిబోమంటూ సురక్షిత ప్రాంతాలకు నడుము లోతు వరద నీటిలోనే పరుగులు తీశారు.

ఉప్పొంగుతు ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలు పెరగడమే తప్ప తగ్గడం లేదు దీంతో వరదల జలదిగ్బంధంలో చిక్కుకున్న బాలాజీ తండా, దుబ్బపేట, దబ్బగట్టు, చిన్నతూండ్ల, మల్లారం గ్రామాల ప్రజలు ఏ సమయాన ఏం జరుగుతుందోనని భయంతో జంకుతున్నారు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కొయ్యూరు ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు రిస్క్ టీం సభ్యులతో సహాయక చర్యలు చేపడుతున్నారు. మల్లారంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు అవిరినేని ప్రకాశరావు బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముంపు లబ్ధిదారులతో సామాన్లు తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్ పల్లి - జయశంకర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు సరిహద్దు మధ్య గల మానేరు నది ఎగువ నుంచి ప్రవహిస్తున్న వరదలతో ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రమాదకరంగా మారిన మానేరు బ్రిడ్జిపై కొయ్యూరు పోలీసులు ట్రాక్టర్లను అడ్డుపెట్టి పెద్దపల్లి- జయశంకర్ జిల్లాలకు రాకపోకలు బంద్ చేశారు.

Adilabad floods : భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం.. ఫోటో ఫీచర్

Advertisement

Next Story